NTV Telugu Site icon

నేడు ఆనంద‌య్య మందు పంపిణీపై హైకోర్టులో విచార‌ణ‌…

ఆనంద‌య్య త‌యారు చేసిన మందు దేశ‌వ్యాప్తంగా చర్చ‌కు వచ్చింది.  దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో ఆనంద‌య్య మందు క‌రోనాకు ప‌ని చేస్తుంద‌ని వార్త‌లు రావ‌డంతో ఒక్కసారిగా ఆయ‌న మందుకు డిమాండ్ పెరిగింది.  ఇక ఈ మందుపై ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఆయుర్వేద ప‌రిశోధ‌న‌సంస్థ‌, తిరుప‌తి ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప‌రిశోధ‌న చేస్తున్నాయి.  570 మంది నుంచి వివ‌రాలు సేక‌రించి ప‌రిశోధ‌న చేశారు.  ఈ నివేదిక‌ను సీసీఆర్ఏఎస్‌కు స‌మ‌ర్పించారు.  సీసీఆర్ఏఎస్ నుంచి అనుమ‌తులు వ‌స్తే ఆనంద‌య్య  మందు త‌యారు చేసేందుకు టీటీడి సిద్దంగా ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంతే, ఆనంద‌య్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.  మందును పంపిణీ ప్రారంభించేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి.  ఈ పిటీష‌న్ల‌పై ఈరోజు విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.