Site icon NTV Telugu

Anam Ramnarayana Reddy: అమ్మవారి జాతరను ప్రభుత్వ పండుగగా జరపాలి

Anam Counters On Tdp

Anam Counters On Tdp

రాష్ట్ర ప్లీనరీలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)కి వెంకటగిరి నియోజకవర్గం తరపున హార్దిక శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy).వెంకటగిరిలోని కేంద్రీయ విద్యాలయలో ఈ ఏడాది నుండి ప్లస్ టూ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ ఏడాది నుండి వెంకటగిరిలో బి.సి. రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభమవుతుంది. త్వరలోనే సంబంధిత మంత్రుల చేత బి.సి. రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభిస్తామన్నారు.

UKRAINE STUDENTS DILEMMA LIVE: ఉక్రెయిన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

ఈ ఏడాది వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర కు ప్రణాళిక రూపోందిస్తున్నాం. రూ.1 కోటి 18 లక్షల రూపాయలతో అమ్మవారికి స్వర్ణాభరణాలు తయారు చేయిస్తున్నాం. అమ్మవారి జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదించాము. అమ్మవారి ఆభరణాలు, ఆస్తుల విషయంలో ఏవైనా తప్పిదాలు ఉంటే కచ్చితంగా విచారణ చేయిస్తాం. అందరి సహకారంతో ఈ ఏడాది జాతరను అత్యంత వైభవంగా జరిపిస్తామన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.

వెంకటగిరిలో 11 మంది అనారోగ్య బాధిత కుటుంబాలకు 18.82 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ… పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందిస్తున్నామని తెలిపారు.

Exit mobile version