Site icon NTV Telugu

కంటి ముందుతో ప్రమాదం లేదు..విచారణ చేయండి : ఆనందయ్య

కంటి ముందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పదహారు సంవత్సరాలుగా కంటి ముందు వేస్తున్నాను ఎవరికీ ఇబ్బంది కలగలేదని..ఇందులో విషము లేదు… వేసిన వారినీ ఎంక్వైరీ చేయండని డిమాండ్‌ చేశారు. ఎవరికి ఇంతవరకు కంటి చూపు దెబ్బ తినలేదని.. ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్తే నేను మందు ఇవ్వడం ఆపేస్తానని పేర్కొన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని.. అనుమతి ఇవ్వకపోతే ప్రజలే ఇబ్బంది పడతారని వెల్లడించారు.

read also : అభిమానులను అడ్డుకున్న పోలీసులు : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫైర్‌

నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ముందు అమ్ముకుంటున్నారని కోర్టులో వేసిన కేసు పై కూడా ఆనందయ్య స్పందించారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వస్తే ఉచితంగా ఇస్తున్నానని.. ప్రతి జిల్లాలో ఉచితంగా ఇస్తున్నామన్నారు. నా పేరు చెప్పుకోనీ ఎవరైనా అమ్ముకుంటున్నారేమో నాకు తెలియదన్నారు. అలా అమ్ముకుంటున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు ఆనందయ్య.

Exit mobile version