Site icon NTV Telugu

Taraka Ratna Health Update: విదేశాలకు తారకరత్న తరలింపు..! పరిస్థితి బట్టి నిర్ణయం

Taraka Ratna

Taraka Ratna

Taraka Ratna Health Update: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను విదేశాలకు తరలించే ఆలోచనలో కుంటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన హిందూపూర్ పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ.. తారకరత్నను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు.. ఈరోజు తారకరత్న మెదడుకు సంబంధించిన స్కాన్ తీశారు.. ఈ రోజు వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్దితి అర్థం అవుతుందని.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు.

Read Also: Shilpa vs Bhuma: అదే అఖిలప్రియ ప్రయత్నం.. ఆడపిల్లలపై కాలు దువ్వే స్థాయికి దిగజారలేదు..!

అయితే, ఇటీవల నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు మొదట కుప్పంలో అందించారు.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ నేతలు నారాయణ హృదయాలయ ఆస్పత్రి దగ్గర వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ హిందూపురం టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టారు. హిందూపురం టీడీపీ పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య.. మరోవైపు.. నందమూరి కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, స్నేహితులు, రాజకీయ నేతలు కూడా ఆస్పత్రిలో పరామర్శిస్తూ వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీస్తున్నారు.

Exit mobile version