Site icon NTV Telugu

Pawan Kalyan Flexi Controversy: ఫ్లెక్సీ వివాదం.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు సీఐ సీరియస్‌ వార్నింగ్..

Pawan Kalyan Flexi Controve

Pawan Kalyan Flexi Controve

Pawan Kalyan Flexi Controversy: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశారు ఫ్యాన్స్‌, జనసైనికులు. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంగా మారింది.. ఆ ఫ్లెక్సీ పై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించిన ఘటన నేపథ్యంలో పోలీసులు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇకపై జిల్లా పేరును ఆ సీమ… ఈ సీమ అంటూ మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైషమ్యాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పి. గన్నవరం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమరాజు..

Read Also: BJP Next President: బీజేపీ అధ్యక్ష రేసులో ఆ రాష్ట్ర సీఎం.. ఆర్ఎస్ఎస్ ఫుల్ సపోర్టు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొన్నాలని స్పష్టం చేశారు పోలీసులు.. మరోవైపు పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఫ్లెక్సీలు ముద్రించే షాపులు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీ గా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఐ భీమరాజు.. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లా పేరు విషయంలో ఆ సీమ.. ఈ సీమ… అని కొంతమంది ప్రచురించడం జరుగుతుంది.. ఇది సరికాదు.. ఎవరైనా సరే ఇక నుంచి ఫ్లెక్సీలో పేరు విషయంలో రెండు వర్గాల మధ్యన విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడతో పాటు.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు..

Exit mobile version