Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!

Arnab

Arnab

Arnab Cyclone Alert: అర్నబ్ పెను తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకొస్తుంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్నబ్‌ తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా అంచనా వేసింది. ఐ. పోలవరం నుంచి రాజోలు మధ్య ఉన్న సుమారు 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైనా తుఫాన్‌ తీరం దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావద్దని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

అర్నబ్‌ పెను తుఫాన్‌ హెచ్చరికలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని ఐ. పోలవరం నుంచి రాజోలు మధ్య ఉన్న 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైనా తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడంతో అలర్ట్ అయ్యారు అధికారులు.. ఇక, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు.. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ప్రజలు రోడ్లపైకి రావద్దని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సూచించారు.. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. తుఫాన్‌ సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.