Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదగడానికి కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారానికి వారాహి ప్రచార రధాన్ని కూడా తయారుచేసుకున్న. ఇక ఈ వారాహి రథంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారాహి రథానికి ఆలివ్ గ్రీన్ కలర్ వేయడంపై ఇతర పార్టీకి చెందిన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలివ్ గ్రీన్ ఎందుకు వేశారు.. పసుపు రంగు వేసుకోండి అని కొందరు అంటుండగా.. మరికొందరు ఆ రంగు కేవలం మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోందని చెప్పుకొచ్చారు.
ఇక వారికి పవన్ కౌంటర్ ఇచ్చాడు. ఆలివ్ గ్రీన్ షర్ట్ ను చూపిస్తూ.. ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా..? లేక ఇది కూడా నిషిద్దమా..? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?” అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్ వేశారు.” శ్వాస తీసుకో.. ప్యాకేజ్ వద్దు” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై జన సైనికులు విరుచుకుపడుతున్నారు. మరి అంబటికి పవన్ ఎలాంటి సమాధానం ఇవ్వనున్నాడో చూడాలి.
శ్వాస తీసుకో …ప్యాకేజీ వద్దు ! @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) December 9, 2022
