ట్విటర్‌లో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయం దగ్గర నుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా వీరి మధ్య వార్ వెళ్ళింది. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన విషయంపై రాంబాబు చేసిన ట్వీట్‌కి గాను.. కాంబాబు అంటూ అయ్యన్నపాత్రుడు బదులిచ్చినప్పటి నుంచి ఈ ట్విటర్ వార్ వ్యక్తిగతంగా మలుపు తీసుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా.. అప్పట్లో రాంబాబు ఓ మహిళతో సన్నిహితంగా మాట్లాడారంటూ వైరల్ అయిన ఆడియో టేప్‌తో అయ్యన్న పాత్రుడు మరోసారి ట్విటర్‌లో షేర్ చేశారు. అంతేకాదు.. ఓ యూట్యూబ్ యాంకర్ కూడా సీఎంకి ఫిర్యాదు చేయడానికి త్వరలోనే రెడీ అవుతోందంటూ, ఆమె మొహం కనిపించని ఓ ఫోటోని సైతం పోస్ట్ పెట్టారు. అయితే, ఈ వార్‌పై తాను ఏమాత్రం తగ్గేదే లేదని, ఎంతవరకూ వెళ్తుందో అంతవరకూ కొనసాగనివ్వండంటూ అంబాబు రాంబాబు చెప్తున్నారు.
డయాఫ్రమ్ వాల్ గురించి ఆప్పుడు తనకు తెలియదని, ఇప్పుడు తెలుసుకున్నానని, అందులో తప్పేంటని రాంబాబు ప్రశ్నించారు. తానో పనికి మాలిన వాడినని టీడీపీ మీడియా చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆడియో టేపులు, వీడియో టేపులన్నీ అభూత కల్పనలని.. బురద చల్లే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదని లేదని.. తాముంతా రాజశేఖరరెడ్డి భక్తులమని.. అంత తేలిగ్గా వదిలేది లేదంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు.
