Amaravati: అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా.. అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం ఇస్తున్నారన్న ఆమె.. కేవలం పుణ్యక్షేత్రాల సందర్శన కాకుండా కుటుంబం మొత్తం అమరావతిలో పర్యటించే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.. వాటర్ స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న ఆమె.. ప్రపంచ దేశాల నుండి రాయల సీమలో ఉన్న తిరుమల దర్శనానికి భక్తులు వస్తున్నారని తెలిపారు.. రాయల సీమలో హార్సిలీ హిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ అమరావతిలో పర్యటించారు.. అమరావతిలోని జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి రోజాతో కలిసి సందర్శించారు కిషన్ రెడ్డి, బుద్దవనం మ్యూజియాన్ని కూడా పరిశీలించారు.. బుద్ధిష్ట్ సర్క్యూట్‌ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజాతో పాటు.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు.
Read Also: Blind Girl Murder Case: తాడేపల్లిలో అంధ బాలిక హత్యపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు..!