Site icon NTV Telugu

CM Chandrababu: సంక్రాంతి సందడి- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు

Babu

Babu

CM Chandrababu: రాష్ట్రంలో ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా వారి ఆకాంక్షలను కూడా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, నేతలు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి వెళ్తే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయని చెప్పారు. మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికే ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పశు సంపదను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: రోజుకు ఒక్క గ్లాస్.. లవంగాలు–నిమ్మ నీరు చేసే అద్బుత మాయ ఇదే!

ఇక, రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోంది.. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు సంక్రాంతి సందడి స్పష్టంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. గ్రామాల అభివృద్ధి, విద్యుత్, నీరు, చెట్టు బిల్లులు, 60 నెలల పెండింగ్ డీఏలు వంటి అంశాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. 2026లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా తమ ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెల్లో పండుగా వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కేరళ తరహాలో పడవ పోటీలు, జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవాలు, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Anil Ravipudi : అనిల్ రావిపూడి ’10వ’ సినిమా ఫిక్స్.. 2027 సంక్రాంతి కూడా బుక్ అయిపోయినట్టేనా !

ఇక, అమరావతి, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులు వేగంగా ముందుకు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు లభించాయి.. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలకు నేరుగా లాభాలు లభిస్తున్నాయి.. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. గండికోటలో ఉత్సవాలు, సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Exit mobile version