Site icon NTV Telugu

Amaravati Jac: కేంద్రమంత్రితో అమరావతి జేఏసీ భేటీ

Jac Amaravati

Jac Amaravati

ఢిల్లీలో కేంద్ర MSME శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ను కలిశారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు. అమరావతి లో “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థ” కు ఐదు ఎకరాల భూమిని శాఖమూరు గ్రామంలో 60 సంవత్సరాల లీజుకు కేటాయించడమైనదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 20.45 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ “సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్”ను వెంటనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. మే నెలలో తప్పనిసరిగా శంకుస్థాపన చేస్తామని నిర్ధిష్ట హామీని ఇచ్చారు కేంద్ర మంత్రి రాణె. దీనిపై అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

https://ntvtelugu.com/ap-cm-jagan-meets-union-ministers-in-delhi-tour/

కేంద్ర మంత్రి నారాయణ రాణేతో పాటు కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ ను కలిశారు అమరావతి బహుజన జేఏసీనాయకుడు బాలకోటయ్య, సుంకర పద్మశ్రీ, కంచర్ల గాంధీ. అమరావతి రైతుల ఉద్యమానికి శరద్ పవార్ మద్దతు ఇచ్చారని తెలిపారు అమరావతి బహుజన జేఏసీ నేతలు.

Exit mobile version