Site icon NTV Telugu

Amaravati JAC: అమరావతి రాజధాని జేఏసీ భేటీ.. రైతుల సమస్యల పరిష్కారంపై చర్చ!

Jac

Jac

Amaravati JAC: గుంటూరులో అమరావతి రాజధాని జేఏసీ సమావేశం అయింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రాజధాని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు.. వైసీపీ విధ్వంసకర పాలనకి వ్యతిరేకంగా రైతులు పోరాడారు.. కూటమి వచ్చాక 2025 ఆగస్టు 5వ తేదీన మంత్రి నారాయణను కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరాం.. సమస్యలు పరిష్కరించలేదు, మళ్లీ మమ్మల్ని కలవలేదు అని అమరావతి జేఏసీ నేత పేర్కొన్నారు.

Read Also: iPhone 17 vs OnePlus 15: మీ బడ్జెట్ 70 వేలా.. ఐఫోన్ 17, వన్‌ప్లస్ 15లలో ఏది బెటర్!

అలాగే, సీఎం చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్నా కలవడానికి కుదరటం లేదని జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ తెలిపారు. సీఆర్డీఏ అధికారులు మమ్మల్ని కలవడానికి, సమస్యలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రైతుల సమస్యల కూడా పరిష్కరించడం అంతే ముఖ్యం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల చివర్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం.. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించారు.

Exit mobile version