NTV Telugu Site icon

Amaravati Farmers: అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్‌..

Padayatra

Padayatra

తమ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చారు అమరావతి రైతులు… పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… ఇక, పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చారు.. అయితే, పాదయాత్రలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి… రామచంద్రాపురంలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది అమరావతి జేఏసీ.. దీంతో, ఇవాళ 41వ రోజు రామచంద్రపురం నుంచి ప్రారంభంకావల్సిన అమరావతి రైతుల మహాపాదయాత్ర నిలిచిపోయింది..

Read Also: Komatireddy Venkat Reddy Viral Video: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు… నిన్న ఆడియో లీక్‌.. నేడు వీడియో..

కాగా, అమరావతి రైతుల మహాపాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.. రామచంద్రపురం విజయ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.. హైకోర్టు ఆదేశాలకు లోబడి పాదయాత్ర చేయాలని పోలీసులు ఆంక్షలు విధించారు.. ఐడీ కార్డులు ఉన్న 600 మందికి, నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు పోలీసులు.. అమరావతి రైతులు మినహా బయటవారు పాదయాత్రలో పాల్గొనకూడదని తేల్చేశారు.. అయితే, నిన్నటిలాగే ఇవాళ కూడా పాదయాత్ర అడ్డుకుంటున్నారని పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు.. ఆ తర్వాత పాదయాత్రకు బ్రేక్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు.. ఇవాళ 41వ రోజు ప్రారంభం కావల్సి ఉన్న అమరావతి రైతుల మహాపాదయాత్ర.. నిలిచిపోయింది.. షెడ్యూల్‌ ప్రకారం రామచంద్రపురం నుంచి కరప మండలం విజయరాయుడిపాలెం వరకూ ఇవాళ పాదయాత్ర సాగాల్సి ఉన్నా.. నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించారు రైతులు.