Amaravati Verdict: మూడురాజధానులపై హైకోర్టు తీర్పు నేడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇవాళ ప్రత్యేకమయిన రోజు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు ధర్మాసనం. ఇప్పటికే ప్రభుత్వ, పిటిషన్ దారుల వాదనలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి నాలుగో తేదీన తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం. తీర్పు ఇవ్వనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.
సుమారు 70 పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు ధర్మాసనం. విచారణ జరుగుతుండగానే మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు. హైకోర్టు తీర్పు అనంతరం రాజధానుల ఏర్పాటుపై న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణం, న్యాయ నగరంలో న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణంపై కూడా నేడు తుది తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!