NTV Telugu Site icon

YV Subba Reddy: టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారింది..

Yv Subbareddy

Yv Subbareddy

టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారిందని వైసీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం అని అన్నారు. ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది.. ట్రాన్స్‌ఫర్ చేయద్దు అని హైకోర్టు చెప్పినా షేర్లు ట్రాన్స్‌ఫర్ చేసారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంటే టీడీపీ కుట్రలో మనం కూడా భాగం అయ్యామని అనిపిస్తోంది.. వాస్తవాలు చెప్పేందుకు జగన్ ఎన్‌సీఎల్టీని ఆశ్రయించారన్నారు. అంతే తప్పా.. తల్లి, చెల్లి పై కేసులు వేయాలని దురుద్దేశం మాత్రం కాదని తెలిపారు.

Kolusu Parthasarathy: అన్ని పాలసీలతో 30 లక్షల కోట్ల పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాలు కల్పన..

ఎన్‌సీఎల్టీలో పిటిషన్ వేయకపోతే మళ్ళీ ఇదే టీడీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. షర్మిలకు మేలు చేయాలని ప్రేమ అభిమానంతో మాత్రమే జగన్ ఎంవోయూ చేశారు.. కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుని సంతకాలు చేశారని తెలిపారు. జగన్ సొంత ప్రాపర్టీలు అని స్పష్టంగా డాక్యుమెంట్స్‌లో ఉంది.. వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలోనే జగన్, షర్మిలకు ప్రాపర్టీలను కేటాయించారని అన్నారు. ఆస్తులు పెంచటంలో షర్మిల పాత్ర ఎక్కడా ఉన్నట్టు తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఆస్తుల్లో షర్మిల వాటా ఉంటే ఈడీ ఎందుకు షర్మిలపై కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం జగన్ పై మాత్రమే కేసులు ఈడీ పెట్టిందని అన్నారు.

Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..

డివిడెండ్‌గా రూ. 200 కోట్లు ఇచ్చారని షర్మిల అనటం సరికాదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న జగన్ చెల్లి షర్మిలకు ఇచ్చినది తప్ప డివిడెండ్ కాదు.. జగతి, భారతి సిమెంట్స్ జగన్ డెవలప్ చేసిన ఆస్తులని అన్నారు. జగన్ సంస్థల్లో సమాన వాటాలు ఇవ్వాలని వైఎస్ఆర్ అనుకుంటే.. అప్పుడే షర్మిల లేదా ఆమె భర్త అనిల్‌లను డైరెక్టర్‌గా పెట్టేవారు కదా అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ చెప్పి ఉంటే జగన్ వారి పేర్లు పెట్టే వారు.. 2014, 2024లో ఒక్క అబద్ధం చెబితే అధికారంలోకి వస్తామని చెప్పినా ఆయన అబద్ధం చెప్పలేదన్నారు. అలాంటి జగన్ ఈ విషయంలో ఎందుకు మాట తప్పుతారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.