NTV Telugu Site icon

YS Jagan: రేపు జగన్‌ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం..

Ys Jagan

Ys Jagan

YS Jagan: మరో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్‌ జగన్‌.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేయటానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారట వైఎస్‌ జగన్‌.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులపైనా చర్చించనున్నారు.

Read Also: EPFO claim Limit: గుడ్ న్యూస్.. ఆటో క్లెయిమ్ పరిమితిని పెంచిన ఈపిఎఫ్ఓ

ఇక, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శిస్తోంది వైసీపీ.. దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం, మిల్లర్లు – దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న అంశాలపై.. పోరాటాలపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక రాష్ట్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతుందంటున్నారు.. అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ అంశంపై ఇదే సమావేశంలో చర్చించనున్నారు.. పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమేరకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Show comments