Jayamangala VenkataRamana: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కీలక నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఆ తర్వాత కొందరు టీడీపీలో.. ఇంకా కొందరు జనసేనలో.. మరికొందరు బీజేపీలో చేరారు.. అయితే, వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.. ఎమ్మెల్సీ పదవికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారట ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ వెంకటరమణ.. గత ప్రభుత్వ హయాంలో.. అంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో.. అప్పటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీని వీడి వైసీపీ చేరారు.. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్..
అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు జయమంగళ వెంకటరమణ.. మరోవైపు.. గత కొంత కాలంగా జయమంగళ వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. దీనిపై ఆయన సన్నిహితులతో సమావేశాలు కూడా నిర్వహించారని.. కొందరు అభిప్రాయాలు తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపించాయి.. మొత్తంగా ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకే నిర్ణయం తీసుకున్నారు.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ.. ఈ మేరకు మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపించారు.. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది వేచి చూడాలి.. కానీ, తిరిగి టీడీపీలో చేరడానికే ఆయన మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది..