YS Jagan: వైసీపీ లీడర్లు… కేడర్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు.. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా ఎమ్మెల్సీలు మినహా అందరితో కలసి ఓ జంబో మీటింగ్ అరేంజ్ చేశారు జగన్.. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మెడికల్ కళాశాలల ప్రవేటీకరణపై వైసీపీ ఆందోళనల నడుమ ముఖ్య నేతలందరితో జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ గేరు మార్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఫలితాలు వచ్చిన తొలి నెల నుంచే పార్టీ కేడర్ తో పాటు లీడర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. కార్యకర్తల నుంచి కీలక నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు.. ఇప్పటికే వరుసగా సమావేశాలు.. మరోవైపు జిల్లా పర్యటనలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్న వైఎస్ జగన్.. ఇంకా వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేశారు.. మీకు అండగా నేను ఉంటానంటూ జగన్ 2.0ను పరిచయం చేశారు జగన్..
మరోవైపు సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు వైసీపీ అధినేత.. అటు రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు సహా యూరియా సమస్యలపై వైసీపీ పోరాటానికి మంచి రెస్పాన్సే వచ్చింది.. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూటమి నేతలతో పాటు స్పీకర్ నుంచి విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నారు.. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం వల్లే తాము సభకు హాజరుకావటం లేదని.. కనీసం మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తామని కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వక పోవటం వల్లే తాము అసెంబ్లీకి వెళ్లటం లేదని చెప్పకోస్తున్నారు ఆ పార్టీ నేతలు.. దీంతో తమకు పట్టున్న మండలికి హాజరవుతున్న ఆ పార్టీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంతో గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు.. మరోవైపు మెడికల్ కళాశాలల ప్రవేటీకరణ అంశంలొ కూడా గట్టి రచ్చే జరుగుతుంది.. రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఆందోళనలు చేస్తూ పీపీపీ అంశాన్ని నిలుపుదల కోసం వైసీపీ ఒత్తిడి తీసుకువస్తుంది.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలకు మండలి సమావేశాలు ఉండటంతో వారిని మినహా పార్టీ లోని కీలక విభాగాల ముఖ్య నేతలందరితో జగన్ ఒకేసారి సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది.. అయితే జగన్ భవిష్యత్ కార్యారణపై పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసేందుకు మాత్రమే పిలిచారా పార్టీ వైపు నుంచి ఏవైనా కీలక నిర్ణయాలు ఉంటాయా ఆసక్తిగా గమనిస్తున్నారు విశ్లేషకులు.. దీంతో పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.. మరి సమావేశంలో జగన్ ఏం మేజిక్ చేయబోతున్నారనేది చూడాలి..
