Site icon NTV Telugu

YS Jagan: అకాల వర్షాలపై వైఎస్‌ జగన్‌ టెలీకాన్ఫరెన్స్‌.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు

Ysjagan

Ysjagan

YS Jagan: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. చేతికి వచ్చిన ఎన్నో పంటలు దెబ్బతినడంతో.. రైతులు గగ్గోలు పెడుతున్నారు.. అయితే, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో భారీ వర్షాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించాలని స్పష్టం చేశారు..

Read Also: Heavy Rains: అకాల వర్షాలతో తీవ్ర నష్టం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..!

ఇక, రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ నేతలకు సూచించారు వైఎస్‌ జగన్.. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కళ్లాల్లో, పొలాల్లో రైతుల వద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించిందని విమర్శించారు.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది . ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడుతున్నారని తెలిపారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్..

Exit mobile version