Site icon NTV Telugu

YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరమని విమర్శించారు. తప్పుడు లెక్కలను చూపించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై జగన్ ఫైర్ అయ్యారు. జనం మోసపోవద్దన్న ఉద్దేశంతో అసలు లెక్కలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తయారు చేసుకున్న లెక్కలకు కాగ్‌ నివేదికలకు ఎలాంటి సంబంధం ఉండదని, కాగ్‌ మాత్రం నిజాలను మాత్రమే బయటపెడుతుందని స్పష్టం చేశారు.

Read Also: Telangaa Rising 2047 Vision Document : విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

జనరల్‌ ఆడిట్‌ రిపోర్టులు (CAG Reports) ప్రభుత్వ నిజమైన ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, పెట్టుబడులను స్పష్టంగా తెలియజేస్తాయని జగన్ గుర్తుచేశారు. వాటి ప్రకారం రాష్ట్ర అప్పులు అధికంగా పెరిగిపోయాయని, ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించారు. మూలధన వ్యయం ఆందోళనకర స్థాయికి చేరిందని, భారీ అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.

అభివృద్ధి జరుగుతోందనుకునే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014–19 మధ్య తెలుగుదేశం పాలనలో రాష్ట్ర GSDP వృద్ధి గొప్పదనమే ఉంటే, ఎలా 2019–24 కాలంలోని జాతీయ జీడీపీలో రాష్ట్రం వాటా 4.78% కాగా, 2014–19 కాలంలో అది కేవలం 4.45% మాత్రమే ఉందని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొందరిని కొన్ని రోజుల పాటు మోసం చేయగలిగినా, అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసేలా చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారమేనని ఆయన విమర్శించారు.

Exit mobile version