NTV Telugu Site icon

YS Jagan: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. కాస్త సమయం తీసుకున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా వివిధ జిల్లాల నేతలతో సమావేశం అవుతూ వస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు మన ప్రభుత్వమే ఉంటుందని భరోసా ఇస్తున్న ఆయన.. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. కష్టాలు ఉంటాయి.. మీకు కష్టం వస్తే నన్ను గుర్తు చేసుకుండి.. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. జైలులో కూడా పెట్టారనే విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నారు..

Read Also: Lailla: విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ సెన్సార్ రివ్యూ..

ఇక, ఈ రోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్.. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగు నాగార్జున, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు జగన్.. పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడటం.. కార్పొరేషన్ లో నెలకొన్న కీలక పరిణామాలపై ఆయన నేతలతో చర్చించనున్నారు..

Read Also: EC Meeting: రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం.. ‘నోటా’ తప్పనిసరిపై చర్చ!