Site icon NTV Telugu

YS Jagan Gets Big Relief: వైఎస్‌ జగన్‌కు భారీ ఊరట.. విజయమ్మ, షర్మిలకు షాక్..!

Nclt

Nclt

YS Jagan Gets Big Relief: నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT)లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఊరట దక్కింది.. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది NCLT.. సరస్వతీ పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.. కంపెనీ షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు వైఎస్‌ జగన్‌… వైఎస్‌ విజయమ్మతో పాటు వైఎస్‌ షర్మిల, సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌, రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.. ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన NCLT.. ఈ రోజు వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా తీర్పును ఇస్తూ సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీని నిలుపుదల చేసింది..

Read Also: ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే

మొత్తంగా.. ‘సరస్వతి’ షేర్ల బదిలీ అక్రమమే అని పేర్కొంది NCLT.. షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌.. అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్న వారికి ట్రిబ్యునల్‌ షాక్‌ ఇచ్చింది.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా షేర్ల బదిలీ సాధ్యం కాదని స్పష్టం చేసింది బెంచ్‌.. తన పేరుపై, వైఎస్‌ భారతి పేర్లపై సరస్వతి కంపెనీలోని షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఎన్సీఎల్‌టీలో 2024, సెప్టెంబర్‌లో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు.. కనీసం తమ సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని పేర్కొన్నారు.. కంపెనీ యాక్ట్‌ 59 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా విజయమ్మ, షర్మిల, జనార్థన్‌ రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, రీజినల్‌ డైరెక్టర్‌ సౌత్‌ ఈస్ట్‌ రీజియనల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ను చేస్తూ.. షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను విజ్ఞప్తి చేశారు.. 10 నెలలుగా అన్ని పక్షాల వాదనలు విని ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసిన బెంచ్‌.. షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌..

Exit mobile version