YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి.. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశారు. గత మూడు నెలలుగా ప్రతి వారం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, స్థానికంగా ఉన్న సమస్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశం ఏకంగా 9 గంటలకు పైగా కొనసాగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో ఇవాళ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాల ఇన్చార్జ్లతో వైఎస్ జగన్ వన్ టు వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ బలం, స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న సన్నద్ధత వంటి అంశాలపై ఇన్చార్జ్లతో నేరుగా చర్చించనున్నారు. ఇవాళ్టితో పాటు రేపు కూడా ఇన్చార్జ్లతో ముఖాముఖి సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు సంస్థాగత బలోపేతంపై జగన్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా పార్టీని మరింత పటిష్టం చేయడం, నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికతో పనిచేయడంపై ఇన్చార్జ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను వేగవంతం చేయాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరుస సమావేశాల ద్వారా పార్టీ నాయకత్వం, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, క్షేత్రస్థాయి నేతల మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు.
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!