Site icon NTV Telugu

KA Paul: మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని.. కేఏ పాల్ వార్నింగ్..

Ka Paul

Ka Paul

KA Paul: మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్‌ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఏపీ హైకోర్టుకు వెళ్తున్న తన వెహికల్‌ ఆపడంపై మండిపడ్డ ఆయన.. కరకట్ట రోడ్డుపై తన వెహికల్ ఆపడం ఏంటి? అని ప్రశ్నించారు.. ఏపీ హైకోర్టు కోర్టు 17లో నా మేటర్ ఉంది.. 20 నిముషాలు సమయం కోరాను.. బెంగుళూరు నుండి ఫైట్లు లేక ఆలస్యం అయ్యిందన్నారు.. ఏపీ హైకోర్టుకు నన్ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.. మిగిలిన వెహికిల్స్ అటు నుండి పంపండి.. కానీ, నా ఒక్క వెహికిల్ కోర్టుకు పంపండి అని కోరారు.. చంద్రబాబు నాయుడు మీరు వీవీవీఐపీ అయి ఉండొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని అన్నారు.. నేను అని తెలిశాక కూడా నన్ను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను కోర్టుకు వెళ్లాలి.. వెంటనే నన్న వదిలిపెట్టండి అంటూ వీడియో రిలీజ్ చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version