NTV Telugu Site icon

YSRCP: ముగిసిన వైసీపీ విస్తృత సమావేశం.. పోరుబాట కార్యాచరణ ప్రకటన..

Ys Jagan

Ys Jagan

YSRCP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్‌ జగన్‌.. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వనుంది వైసీపీ.. డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళనకు పిలుపునిచ్చారు.. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ SE,CMD కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలని.. విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది.. ఇక, జనవరి 3న ఫీ రీయింబర్స్ మెంట్ కోసం వైసీపీ పోరు బాట నిర్వహించనుంది.. విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు.. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్‌ జగన్‌..

Read Also:Vitamin D In Winter: శీతాకాలంలో ఎక్కువతున్న విటమిన్ డి లోపం.. అధిగమించడానికి ఇలా చేస్తే సరి

తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్‌ 11న ర్యాలీ, కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం ఇవ్వనుండగా.. రూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణకు డిమాండ్‌ చేస్తోంది వైసీపీ.. డిసెంబర్‌ 27న కరెంటు ఛార్జీలపై ఆందోళన నిర్వహించి.. కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయనుంది.. జనవరి 3న ఫీజురియింబర్స్‌మెంట్‌కోసం పోరుబాట నిర్వహించనున్నట్టు ప్రకటించారు..

Show comments