Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, ఈ నెల మూడో వారంలోనే నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కొల్లం వాగు నుంచి టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన అప్రోచ్ ఛానెల్ క్లియరింగ్ పూర్తైందన్నారు. రెండు టన్నెల్స్‌లో మిగిలిన 286 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, టన్నెల్-2లో చిక్కుకుపోయిన టిబిఎం (TBM) యంత్రాన్ని తొలగించే ప్రక్రియ కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. 1,900 మెట్రిక్ టన్నుల బరువున్న టిబిఎం యంత్రంలో ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నులను వెలికితీసినట్లు, మిగిలిన 600 మెట్రిక్ టన్నులను కూడా 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు.
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి, ఐదేళ్లలో టిబిఎం యంత్రాన్ని తొలగించలేకపోయారని, చుక్క నీరు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రచారం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ.450 కోట్లతో ఫీడర్ కెనాల్లో కేవలం ఆరు నెలల్లోనే 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించి, 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసిందన్నారు. నిర్వాసితుల పునరావాసంపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,560 కుటుంబాలకు రూ.318 కోట్లు అందజేశామని చెప్పారు. ఈ వారం మరో 2,863 కుటుంబాలకు రూ.353 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. మిగిలిన 1,898 కుటుంబాలకు ఈ నెలాఖరులోగా రూ.210 కోట్లు చెల్లించి ఆర్అండ్ఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!