Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత రైతులకు కూడా సాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత 11 ఏళ్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. 2015లో తాను గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం కుడి కాల్వ సమీపంలోని మెట్ట ప్రాంత గ్రామాలకు కూడా నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని లేఖ ద్వారా గుర్తు చేశారు వంశీ..
దీంతో తన సొంత ఖర్చులతో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో మొత్తం 36 ప్రాంతాల్లో 500కుపైగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు, చెరువులకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు నిరంతరంగా మెట్ట ప్రాంతాలకు పట్టిసీమ నీరు అందించగలిగామని పేర్కొన్నారు వల్లభనేని.. అయితే ఈ ఏడాది నీటిపారుదల అధికారులు, పోలీసులు బందోబస్తుతో మోటార్లను నిలిపివేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, అనంతరం జగన్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించాయని గుర్తుచేస్తూ, ప్రస్తుతం కూడా రైతుల ప్రయోజనాల దృష్ట్యా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్..
Also Read
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!