NTV Telugu Site icon

Chilli Prices: మిర్చి ధరలపై ఏపీ ప్రతిపాదనలు.. రేపు కేంద్రమంత్రి కీలక సమావేశం..

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Chilli Prices: మిర్చి ధరలకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో రేపు సమావేశం జరగనుంది.. రేపు ఉదయం 11 గంటలకు కృషిభవన్‌లో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రి . ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు పడిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కోరింది.. దీంతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ నుంచి మిర్చి ఎగుమతులకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నారు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి మార్కెట్ ధర… అవసరం అయితే కేంద్ర సహాయంపై కూడా చర్చ జరగనుంది..

Read Also: CM Chandrababu: అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటాం..

కాగా, అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చిన విషయం విదితమే.. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు వెల్లడించారు.. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే..