NTV Telugu Site icon

YCP: అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఇంఛార్జుల మార్పుల కసరత్తు

Balineni

Balineni

వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ అధిష్టానంతో నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్నినానితో సీఎం చర్చించారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు మాధవ్ కు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.. మరోవైపు సీఎం జగన్ తో విజయసాయిరెడ్డి, బాలినేని కూడా భేటీ అయ్యారు. ఒంగోలు రాజకీయాలు, పార్టీలో అసంతృప్తులపై చర్చిస్తున్నారు.

Chandrababu Naidu: కుప్పంలో రౌడియిజం పెరిగిపోయింది.. వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తా..

వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పులు:
కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. ఇంఛార్జ్ గా పరిశీలనలో మక్బూల్
పెనుకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణ.. పరిశీలన అభ్యర్థి మంత్రి ఉషాశ్రీ చరణ్
కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్.. పరిశీలనలో ఎంపీ తలారి రంగయ్య పేరు
రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. పరిశీలన అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి (ఏపీఐఐసీ ఛైర్మన్)
శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పరిశీలనలో శమంతకమణి లేదా ఆమె కుటుంబ సభ్యులు లేదా శ్రీనివాస్ మూర్తి (పోలీసు డిపార్ట్మెంట్)
మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి.. పరిశీలనలో సీఐ శుభ కుమార్
హిందూపురం ఎంపీగా గోరంట్లకు మొండి చేయి అని సమాచారం.. ఆ స్థానంలో బళ్ళారికి చెందిన శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలన ( వాల్మీకి కమ్యూనిటీ)

Show comments