Site icon NTV Telugu

Joint Staff Council Meeting: చర్చలు విఫలం.. యధావిధిగా ఉద్యమ కార్యచరణ కొనసాగిస్తాం

Bosta

Bosta

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. కాగా.. మరోసారి భేటీకి నిర్ణయం తీసుకున్నారు. భేటీకి సంబంధించి తేదీ ఖరారు కాలేదు. ఈ సందర్భంగా మీటింగ్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీజేఏసీ ప్రకటించిన ఆందోళనల గురించి తనకు తెలియదన్నారు. మార్చి నెలాఖరుకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.5 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. మిగతా బకాయిలు జూన్ నెలాఖరు వరకు విడుదలకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో IR ను ప్రకటించాలని ఏపీ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వంను కోరాయన్నారు. మరోవైపు.. వైజాగ్ MRO ఫ్యామిలీకి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబంలో ఒక్కొరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.

Health Tips: ప్రతి రోజూ రెండు చుక్కల నెయ్యి మీ ముక్కులో వేసుకుంటే ఈ సమస్యలు మాయం..!

మరోవైపు.. ఏపీ జేఏసీ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇవాళ ప్రభుత్వంతో జరిపిన చర్చలు వారిని నిరుత్సాహపరిచాయన్నారు. తమ పోరాటాన్ని యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి తమకు రావలసిన బకాయిలు ఈరోజు, ఈ నెలలో ఇస్తామన్న దాఖలాలు లేవని చెప్పారు. IR ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం.. మాట్లాడి చెబుతామని అన్నారని తెలిపారు. 14వ తేదీ నుంచి యధావిధిగా ఉద్యమ కార్యచరణ కొనసాగిస్తామని బండి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Farmers Protest: తాత్కాలిక జైలుగా ఢిల్లీ బవానా స్టేడియం

Exit mobile version