Site icon NTV Telugu

AP Government: ఏపీ సర్కార్‌ కసరత్తు.. ఇక, రేషన్‌ బదులు నగదు..!

Ration

Ration

AP Government: రేషన్ బదులు నగదు ఇచ్చే విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఏపీలో గతంలో ఉన్న విధానానికి స్వస్తి చెప్పా.. ఈ నెల 1వ తేదీ నుంచి షాపుల ద్వారా రేషన్‌ను పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్‌.. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు మరో కీలక ప్రతిపాదన వచ్చిందట.. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే.. వారికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట.. ఈ దిశగా రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయడంపై దృష్టి సారించింది ప్రభుత్వం.. ఇక, బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా.. అందుకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 1న కోనసీమ జిల్లా పర్యటనలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే..

Read Also: Eatala Rajendar: అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్‌ నిర్ణయం మేరకే!

రేషన్ బదులు నగదు ఇచ్చే విషయంపై కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులకు సంబంధించి అధ్యయనం చేస్తోందట.. గతంలో పాండిచ్చేరి ప్రభుత్వం అమలు చేసిన వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.. ఒక వేళ రేషన్ బదులుగా నగదు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహకారంపై కూడా దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం.. అయితే, అక్రమ బియ్యం అరికట్టడానికి రేషన్ బదులు నగదు అమలు కూడా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. దీంతో, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు..

Exit mobile version