NTV Telugu Site icon

Liquor Sales: మద్యం అమ్మకాల వ్యవహారంపై మండలిలో రచ్చ.. కొల్లు రవీంధ్ర కామెంట్లతో..

Liquor Sales

Liquor Sales

Liquor Sales: మద్యం అమ్మకాలపై చర్చ కాస్తా.. అధికార, ప్రతిపక్షం మధ్య శాసనమండలిలో కాకరేపింది.. మద్యం విక్రయాలు, అక్రమాలపై మండలిలో మాట్లాడిన మంత్రి మంత్రి కొల్లురవీంద్ర.. మద్యం కుంభకోణంపై సిట్ వేశాం. సిట్ వేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఎంతమంది ఈ అక్రమాల్లో ఉన్నారో తేలుస్తాం… సీఐడీ విచారణలో అన్నీ తేలుస్తాం అన్నారు.. ఇక, మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.. శాసనమండలి విపక్షనేత బొత్స మాట్లాడుతూ.. తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం.. తాడేపల్లి ప్యాలెస్ లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు.. రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్‌ చేశారు.. అంతేకాదు.. ఆధారాలుంటే రుజువుచేయండి. బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు. తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్ లో ఎంక్వైరీ బైండింగ్స్ లో చేర్చుకోండి అని సవాల్‌ చేశారు బొత్స.

Read Also: Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తప్పుల తడకలు..

అయితే, తాడేపల్లి ప్యాలెస్ వద్ద అగ్ని ప్రమాదం పై విచారణ జరిపించామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. మాదగ్గర కొన్ని ఆధారాలున్నాయి. ప్రభుత్వ సీసీ కెమెరాల్లో కొంతమేర ఆధారాలున్నాయి. అక్కడున్న ఇంటి నుంచి వచ్చి తగలబెట్టినట్లు మాకు సమాచారం వచ్చింది. బాధ్యత కలిగిన వ్యక్తులైతే సమాచారం ఇవ్వాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. మా నాయకుడిపై దాడి చేయాలని చూశారంటూ తిరిగి కేసు పెట్టారి ఫైర్‌ అయ్యారు అచ్చెన్నాయుడు.. ఇక, ఈ అంశంలో కలుగజేసుకున్న హోం మంత్రి అనిత… ఏదైనా సంఘటన జరిగినప్పుడు చుట్టుక పక్కల సీసీ కెమెరా ఉంటే ఎవరైనా ఆ ఫుటేజ్ ని పోలీసులకు ఇవ్వాల్సిందే.. అది రూల్ లో ఉందన్నారు.. నిజంగా మీ నాయకుడికి భద్రత భయం ఉంటే విచారణకు మీరు ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు.. మీ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని ఎందుకు ఇవ్వరు..? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు హోం మంత్రి అనిత.. మరోవైపు.. శాసనమండలి విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు.. మీ దయా దాక్షిణ్యాలతో మేం ఇక్కడ కూర్చోలేదన్న ఆయన. మాకు సభలో మాట్లాడే హక్కు ఉంది. తాడేపల్లి ప్యాలెస్ అనే పదం వాడటం సరికాదు.. ప్యాలెస్ లు అందరికీ ఉన్నాయని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ..