NTV Telugu Site icon

Free Gas Cylinder: ఉచిత గ్యాస్‌కి సూపర్‌ రెస్పాన్స్‌.. భారీగా బుకింగ్స్‌.. అదే స్థాయిలో డెలివరీ

Free Gas Cylinder Scheme

Free Gas Cylinder Scheme

Free Gas Cylinder: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. దీపావళి సందర్భంగా దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఈ స్కీమ్‌ కింద గ్యాస్‌ బుకింగ్స్‌కి భారీ స్పందన వస్తుందు.. అదే స్థాయిలో డెలివరీ చేస్తోంది కూటమి ప్రభుత్వం.. దీపం-2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు..

Read Also: Team India: టీమిండియా ఆటగాళ్లు కూడా అందరిలాగే: డౌల్‌

ఇప్పటివరకు అంటే 04.11.2024 తేదీ వరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ చేసుకున్నారు.. ఇదే సమయంలో ఇప్పటి వరకు 6,46,350 సిలిండర్లు డెలివరీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. ఇప్పటివరకు సిలిండర్స్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు రూ.38.07 కోట్ల సబ్సిడీ అందించాల్సి ఉండగా.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 04.11.2024 తేదీన ఒక్కరోజే దీపం-2 పథకం కింద 64,980 గ్యాస్ సిలిండర్లు బుక్ కాగా.. 17,313 సిలిండర్లు డెలివరీ చేశారు. 03.11.2024 తేదీన ఒక్కరోజే 6,29,037 సిలిండర్లు డెలివరీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ల నిమిత్తం ఏర్పాటు చేసిన 1967 టోల్ ఫ్రీ నంబర్ కు ఇప్పటి వరకు 3660 కాల్స్ రాగా వాటికి పరిష్కారం చూపడం జరిగినట్టు వెల్లడించారు జరిగింది.

Show comments