Site icon NTV Telugu

PM Modi Amaravati Visit: ప్రధాని మోడీ పర్యటన.. అమరావతిని జల్లెడ పడుతున్న ఎస్పీజీ..!

Spg

Spg

PM Modi Amaravati Visit: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రాబోతున్నారు.. మే 2వ తేదీన ఏపీ రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు భారత ప్రధాని.. మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.. మంత్రులు, అధికారులతో కమిటీలు వేసి.. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతీరోజూ.. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ ఆరా తీస్తున్నారు.. ఇక, ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందే ఎస్పీజీ రంగంలోకి దిగింది.. అమరావతి చేరుకున్న ప్రధాని మోడీ భద్రతా దళం.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి.. మోడీ టూర్‌ సాగే రూట్లలో ప్రయాణిస్తూ.. ప్రత్యేకంగా పరిశీలించింది SPG.. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.. భద్రతా ఏర్పాట్లను SPGకి వివరించారు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ అధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని టూర్ కోసం ఏర్పాటైన మంత్రివర్గ సభ్యులు..

Read Also: AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌..!

కాగా, ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారు అయ్యింది.. ప్రధాని మోడీ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ అధికారికంగా ఏపీ ప్రభుత్వానికి అందింది.. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్న విషయం విదితమే కాగా.. మే 2వ తేదీన తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు మోడీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి చేరుకోనున్నారు ప్రధాని.. ఏపీ సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్‌ నుంచి 3.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు.. ఇక, అప్పటి నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాబోతున్నారు.. మొత్తంగా ప్రధాని మోడీ అమరావతి పర్యటన గంట 15 నిమిషాల పాటు సాగనుంది.. ఆ తర్వాత హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని.. అక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..

Exit mobile version