Site icon NTV Telugu

Smart Ration Cards: స్మార్ట్‌ రేషన్‌ కార్డులు.. ఇక, వారికి చెక్‌..!

Smart Ration Cards

Smart Ration Cards

Smart Ration Cards: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి సిద్ధమైంది.. పాత రేషన్‌ కార్డుల స్థానంలో కీలక మార్పులతో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు తీసుకురానుంది.. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని.. ఈ నెల 31వ తేదీ వరకు రేషన్‌ కార్డులు పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించింది.. మొత్తంగా ఏపీ లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.. మన దగ్గర ఉండే ఏటీఎం కార్డు లాగా స్మార్ట్ రేషన్‌ కార్డు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. కుటుంబ సభ్యుల వివరాలు ఈ కార్డుపై ఉంటాయి.. ఈ నెల చివరిలోగా రేషన్‌ కార్డుల పంపిణీ పూర్తి చేయకుండగా.. వచ్చే నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డులతోనే రేషన్ ఇవ్వనుంది సర్కార్..

Read Also: US Pakistan 1971 Alliance: 1971లో పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా.. అమెరికా తీరును ఎండగట్టిన భారత సైన్యం

రేషన్ పంపిణీ మరింత ఎఫెక్టివ్ గా నిర్వహించడానికి డిజిటల్ రేషన్ కార్డులు సమర్థంగా పని చేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈనెల 25వ తేదీన పండుగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఇక., రేషన్ బియ్యం అక్రమ రవాణా నియంత్రణకు విజిలెన్స్ మరింత పటిష్టం చేశామని.. విశాఖ, నెల్లూరు వంటి చోట్ల అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్యూ ఆర్ కోడ్ తో రూపొందించిన కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు అని స్పష్టం చేశారు.. సుమారు లక్షా 40 వేల కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ఇష్యూస్ వున్నాయి.. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం.. గతం కంటే 200 శాతం ఎఫెక్టివ్ గా విజిలెన్స్ పని చేస్తోంది.. కాకినాడ పోర్ట్ తరహాలోనే విశాఖ, నెల్లూరు సహా పోర్టుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం.. గిరిజన సహకార సంస్థలతో త్వరలోనే ఒప్పందం చేసుకుంటాం.. గిరిజన ఉత్పత్తులు రేషన్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్..

Exit mobile version