Site icon NTV Telugu

SKOCH Award For APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీకి మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డు

Skoch Award

Skoch Award

SKOCH Award For APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.. 2024 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్ల జారీ అంశంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రతిష్టాత్మక “స్కోచ్” అవార్డు వరించింది.. సంస్ధ తరఫున స్కోచ్ అవార్డును అందుకున్నారు ఏపీఎస్‌ఆర్టీసీ ఛీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు.. బస్సులలో డిజిటల్ పద్ధతిలో టికెట్ల జారీ అంశంలో స్కోచ్ అవార్డు వచ్చినట్టు ఏపీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది..

Read Also: US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి.. కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి

2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక అయినట్టు తెలియజేయడానికి సంతోషిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్న ఏపీఎస్‌ఆర్టీసీ.. యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టుట, In Busలో డిజిటల్‌ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్‌ సిస్టంను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకుందని తెలిపింది.. ఈ రోజు, ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ ఐటీ వై శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకోవడం జరిగిందని ఏపీఎస్‌ఆర్టీసీ తన ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version