NTV Telugu Site icon

AP Assembly Session: ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ కీలక బిల్లులు

Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి.. ఈ రోజు శాసనసభ ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రశ్నోత్తరాల‌తో ప్రారంభం కానుంది..

శాసనసభలో ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు..
* ఉద్యోగుల అంత‌ర్ రాష్ట్ర బ‌దిలీలు.
* సాగునీటి కాల్వల నిర్వహ‌ణ‌.
* ఆక్వా రైతుల‌పై ప‌న్ను విధింపు.
* విద్యార్థులకు ఆర్ధిక స‌హాయం.
* క‌డ‌ప జిల్లాలో ఎస్సీ,ఎస్టీ ల‌కు వాహ‌నాల పంపిణీ.
* ఐటిడిఏ ప్రాజెక్ట్ పాడేరు..
* పిలేరు నియోజ‌క వ‌ర్గంలో అడ‌విప‌ల్లి ప్రాజెక్ట్.
* చేనేత కార్మికుల‌కు ప్రోత్సాహ‌కాలు.
* కార్మిక సంక్షేమం మండ‌లి.
* డ్వాక్రా సంఘాల‌కు సున్నా వ‌డ్డీ ప‌థకం
* ప‌లు డిపార్టె మెంట్లకు సంబంధించిన డిమాండ్స్ పై ఆయా శాఖ‌ల మంత్రుల వివ‌ర‌ణ‌.

అసెంబ్లీ ముందుకు వచ్చే బిల్లులు
* ఆంధ్రప్రదేశ్‌ కో ఆప‌రేటివ్ సోసైటిస్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు -2024
* ఆంధ్ర ప్రదేశ్‌ ఎక్సైజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు -2024
* ఆంధ్ర ప్రదేశ్ ప్రోహిబిష‌న్ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లు – 2024
* ఆంధ్రప్రదేశ్‌ ఇండియా మెడ్ లిక్కర్, ఫార‌న్ మెడ్ లిక్కర్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు-2024

ఇవాళ్టి చర్చలు
* రిషికోండ పై భ‌వ‌నాలు నిర్మాణంపై స్వల్ప కాలిక చ‌ర్చ
* రాష్ట్రంలో పోల‌వ‌రం ప్రాజెక్ట్, ఇత‌ర సాగునీటి ప్రాజెక్ట్ ల‌పై స్వల్పకాలిక చ‌ర్చ..

ఇక, ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రశ్నోత్తరాల‌తో ప్రారంభం కానుంది శాస‌న మండ‌లి..

ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు
* మ‌ద‌నప‌ల్లిలో భూ రికార్డులు ద‌గ్ధం .
* ఆక్వా రైతుల‌కు ఆర్దిక సాయం.
* భీమిలిలో శార‌దా పీఠానికి భూముల కేటాయింపు.
* నెల్లిమర్ల జ‌న‌ప‌నార మిల్లు మూసివేత‌.
* విశాఖప‌ట్నంలో రిషికోండ ప‌ర్యాట‌కం.
* రాష్ట్రంలో నూత‌న ర‌హాదారుల మంజూరు.
* టిటిడి ల‌డ్డులో క‌ల్తీ నెయ్యి.
* రాష్ట్రంలో ఓడరేవులు,ఫిషింగ్ హ‌ర్బర్లు.
* ఆరోగ్య శ్రీ ప‌థకంలో అక్రమాలు.
* వ‌ర‌దల కార‌ణంగా పంట న‌ష్టం
* గ్రామాల్లో డంపింగ్ యార్డులు.
* పంచాయితీ భ‌వ‌నాల‌కు రంగులు..

మండ‌లిలో 5 బిల్లులు ప్రవేశ‌పెట్టనున్న ప్రభుత్వం.
* ఏపీ పంచాయితీ రాజ్ స‌వ‌ర‌ణ బిల్లు -2024
* ఏపీ మున్సిప‌ల్ స‌వ‌ర‌ణ బిల్లు- 2024 .
* ఎన్టీఆర్ హెల్త్ యునివ‌ర్శిటి స‌వ‌ర‌ణ బిల్లు- 2024
* ఏపీ అయుర్ వేదిక్ హోమియో ప‌తిక్ చ‌ట్టస‌వ‌ర‌ణ బిల్లు-2024
* ఏపీ మెడిక‌ల్ ప్రాక్టిస‌న‌ర్స్ రిజిస్ట్రేష‌న్ చ‌ట్టస‌వ‌ర‌ణ బిల్లు- 2024