AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు.. అయితే, వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ధర్మాసనం.. దీంతో, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. ఇక, ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో తక్షణ ఊరట ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.. మరోవైపు, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరగా.. మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది ధర్మాసనం.. ఇక, కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం..
Read Also: Bhatti Vikramarka : ఇక మెరుగైన వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు
కాగా, మద్యం కేసులో ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. ఆ పిటిషన్లను కొట్టేసింది. అంతే కాదు.. ఈ కేసులో అన్ని వివరాలు బయటకు రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకొని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది.. దీంతో, నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వారికి షాక్ తగిలినట్టు అయ్యింది..
