AP Revenue Deficit: రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. కానీ.. ఏపీలో మాత్రం రెవెన్యూ లోటు అంతకంతకూ పెరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. రాష్ట్రానికి వచ్చే రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. 2025-26లో 33వేల 185 కోట్లు రెవెన్యు లోటు ఉంటుందని అంచనా. కానీ.. ఆరు నెలలకే 46వేల 652 కోట్లకు చేరింది. అంచనాలకు తగినట్లు రాబడులు పెరగడం లేదు.. అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో కూడా రెవెన్యూ లోటు ఎక్కువగానే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 17వేల 036 కోట్లు ఉంటుందని అంచనావేశారు. కానీ.. 10 నెలల్లో లోటు 47వేల 958 కోట్లకు చేరుకుంది. అంచనాలతో పోలిస్తే ఇది 281 శాతానికి చేరినట్టు లెక్క. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసినా.. 140 శాతం పెరిగింది.
Read Also: Suicide in OYO: బెట్టింగ్ బారిన పడిన యువకుడు.. ఓయోలో ఆత్మహత్య
రెవెన్యూ రాబడికంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే అదే.. రెవెన్యూలోటు… రెవెన్యూ రాబడి అంటే.. అప్పులను మినహాయించగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెవెన్యూ లోటు తగ్గిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ అంచనాల్లో కూడా రెవెన్యూ లోటును చాలా తక్కువగా చూపిస్తోంది. కానీ… వాస్తవాలు వేరే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నుంచి సెప్టెంబర్ నాటికే రెవెన్యూ లోటు 16వేల 652 కోట్లకు చేరింది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేకపోవడంతో లోటు ప్రమాదకర స్థాయికి చేరుతోందిని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి.
రెవెన్యూ ఖర్చుల్లో జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, పింఛన్ల వాటానే ఎక్కువగా ఉంది. వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ… పథకాలకు అనర్హులను ఏరివేయడం, అవసరంలేని పథకాలకు కోతలు వేయడం ద్వారా రెవెన్యూ లోటు కాస్తయినా కట్టడి చేయవచ్చు. అనవసర ఖర్చులతో లోటు పెరగడంతో పాటు అప్పుల భారం పెరుగుతోంది.. అప్పులకు వడ్డీ చెల్లింపులతో రెవెన్యూ వ్యయం పెరుగుతుంది.
