CRDA: కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.. ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్లాట్లకు ఈ-లాటరీ నిర్వహించామని.. 2016లో విమానాశ్రయ విస్తరణ నిమిత్తం 12.5315 ఎకరాల భూములిచ్చిన 20 మంది రైతులకు.. 24 రెసిడెన్షియల్ ప్లాట్లు, 15 కమర్షియల్ ప్లాట్లు మొత్తంగా 39 ప్లాట్లు వారికి అందజేశామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) బీఎల్ఎన్ రాజకుమారిణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. రిటర్నబుల్ ప్లాట్లను రైతుల సమక్షంలో ఈ లాటరీ విధానంలో అందజేశాం.. రైతులకు భౌగోళికంగా వారి ప్లాట్లు ఎక్కడున్నాయో వివరించడానికి ప్రత్యేకంగా జీ.ఐ.ఎస్ సిబ్బందిని, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు.. ప్లాట్లు పొందిన రైతులకు సౌకర్యంగా ఉండేందుకు అమరావతిలో తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు.. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజినల్ సర్టిఫికెట్లు అందుకున్న వారం రోజులలోపు సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాలకు వెళ్లి రైతులు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొంది ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం.
Read Also: Koti Deepotsavam 2024 -LIVE Day -17: యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం