Site icon NTV Telugu

YS Jagan: రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో.. ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో ప్రజల ముందుకు..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం.. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు నిర్వహిస్తాం అన్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం.. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్‌ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్‌.. నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్‌ చేయాలని సూచించారు.. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు జగన్‌..

Read Also: Tamil Nadu: ఆస్తి పంపకాల్లో తండ్రీకూతుళ్ల మధ్య వివాదం.. ఆలయానికి రూ. 4 కోట్ల విరాళం..!

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే.. ప్రజాగళం. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయన్నారు జగన్‌.. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్‌ పంపారు. కానీ, ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు..

Read Also: Kuberaa : 100 కోట్ల ‘కుబేరు’డు!

అయితే, ఏడాది గడిచింది. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది.. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే.. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైఎస్‌ జగన్.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం. ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

Exit mobile version