ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పున:ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాకు వాన గండం పొంచి ఉన్నట్లుగా వాతావరణ వాఖ హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. దీంతో ప్రధాని సభకు వాన గండం పొంచి ఉండడంపై అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి: Amaravati: రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు ఆదేశం
నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చిస్తు్న్నారు. ఇటీవల చోటుచేసుకున్న తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సభకు వచ్చే వారి భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టారు. శుక్రవారం సభా ప్రాంగణంలో వర్షం కురిస్తే ఏం చేయాలన్న దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకవేళ వర్షం వస్తే.. ప్రజలు చెదిరిపోయి.. తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకోసమే ముందు జాగ్రత్తగా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు ఏపీకి మోడీ.. అమరావతి పనులు ప్రారంభించనున్న ప్రధాని
