NTV Telugu Site icon

Purandeswari: అమిత్ షా పొత్తు కామెంట్.. పురంధేశ్వరి ఏమన్నారంటే..

Purandhareshwarai

Purandhareshwarai

Purandeswari: మోడీ తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదు.. పేదల కోసమని బీజేపీ ఏపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా పొత్తు కామెంట్లపై ఆమె స్పందించారు. బీజేపీ తన ప్రస్థానాన్ని ఇద్దరు ఎంపీలతో ప్రారంభించిందన్నారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పని చేస్తున్నారని, దేశంలో పారిశ్రామిక ప్రొత్సాహాం.. ఉపాధి కల్పన ఉండాలని దీన్ దయాళ్ చెప్పేవారని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో దేశాభివృద్ధి, ఉపాధి కల్పన లభిస్తుందనేది దీన్ దయాళ్ సిద్దాంతం అన్నారు.

Read also: Shiv Sena MLA: “మీ పేరెంట్స్ నాకు ఓటేయకుంటే రెండు రోజులు తినకండి”.. పిల్లలతో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

దీన్ దయాళ్ సిద్దాంతాలను బీజేపీ తూచా తప్పకుండా పాటిస్తోందన్నారు. స్వదేశీ, అంత్యోదయ వంటి నినాదాలను బీజేపీ కొనసాగిస్తున్నామని తెలిపారు. 2014కు ముందు ప్రతి రోజూ స్కాంల పర్వమే అన్నారు. దాదాపు 15 స్కాంలు యూపీఏ హయాంలో జరిగాయన్నారు. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అంతా స్కీముల పర్వమే అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆర్బీఐ గవర్నర్లు.. ఆర్థిక నిపుణులే గాడిలో పెట్టగలరనే భావనను బీజేపీ పక్కన పెట్టిందన్నారు. మంచి చేయాలనే మనస్సు ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని మోడీ నిరూపించారని తెలిపారు. మోడీ తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదు.. పేదల కోసమని, బీజేపీ విధానాలు నచ్చి చాలా మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరే వారు కండువా వేసుకోవడమే కాకుండా సిద్దాంతాలను పాటించాలని తెలిపారు.
Shiv Sena MLA: “మీ పేరెంట్స్ నాకు ఓటేయకుంటే రెండు రోజులు తినకండి”.. పిల్లలతో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Show comments