Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం గ్యాప్-2 ఆనకట్ట నిర్మాణంలో తీవ్ర సాంకేతిక వ్యత్యాసాలను తన లేఖలో ప్రస్తావించారు. పూర్తిస్థాయి డిజైన్ ఆమోదాలు లేకుండానే పనులు కొనసాగించడం ప్రమాదకరం
అని ఉండవల్లి హెచ్చరించారు. ఆనకట్ట పునాది స్థాయిలో వ్యత్యాసం ఉండటం వల్ల స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందనీ... పునాది కింద ఇసుక కోతకు గురైతే భవిష్యత్తులో వినాశకర పరిణామాలు తప్పవని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వాల తప్పుల నుండి నేర్చుకోకుండా తొందరపాటుతో పనులు చేయడం సరికాదని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి హితవు పలికారు. ఇదే లేఖనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్… నిమ్మల రామానాయుడు.. కందుల దుర్గేష్ కు కూడా విడుదల చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..
మొత్తంగా తూర్పు గోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న Polavaram Project పై మరోసారి చర్చ మొదలైంది. మాజీ ఎంపీ Undavalli Arun Kumar ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu కు బహిరంగ లేఖ రాస్తూ పోలవరం గ్యాప్-2 ఆనకట్ట నిర్మాణంలో ఉన్న సాంకేతిక అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేశారు. తొందరపాటు నిర్ణయాలతో పనులు ముందుకు తీసుకెళ్లకూడదని ఆయన సూచించారు. లేఖలో పేర్కొన్న ప్రకారం, పూర్తి స్థాయి డిజైన్ ఆమోదాలు లేకుండానే గ్యాప్-2 ఆనకట్ట పనులు కొనసాగించడం ప్రమాదకరమని ఉండవల్లి పేర్కొన్నారు. నదీ గర్భం స్థాయి +8.32 మీటర్ల వద్ద ఉండగా, +15.50 మీటర్ల ఎత్తైన బేస్ లెవల్ నుండి పనులు చేపడుతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ రెండు స్థాయిల మధ్య 7.18 మీటర్ల వ్యత్యాసం ఉండటం ఆనకట్ట స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆనకట్ట పునాది కింద ఇసుక కోత (స్కౌరింగ్) జరిగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే Central Water Commission కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ పనులు వేగంగా కొనసాగించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. టెయిల్ వాటర్ లెవల్స్ మార్పులు, ఫ్రీబోర్డ్ లెక్కల విషయంలో కూడా స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థ AFRY నుండి రావాల్సిన కీలక డిజైన్ పత్రాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. గతంలో డయాఫ్రమ్ వాల్ వైఫల్యం కారణంగా సుమారు రూ.3,000 కోట్ల అదనపు భారం పడిందని గుర్తు చేశారు.
గత ప్రభుత్వాల తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోవాలని, అదే తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదని ఉండవల్లి హితవు పలికారు. ప్రజల భద్రత, ప్రాజెక్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతిక లోపాలను సరిచేసిన తర్వాతే ఆనకట్ట నిర్మాణాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులో ప్రతి నిర్ణయం అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..
