Site icon NTV Telugu

AP Government: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సర్కార్.. రూపాయికే ఇంటి నిర్మాణానికి అనుమతులు.. ఉత్తర్వులు జారీ..

Ap Government

Ap Government

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది.. కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. వారికి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వనుంది.. 50 చదరపు గాజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఫీజ్ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నగర పాలక సంస్థలు.. నగర పంచాయతీల్లో పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి ఫీజు వసూలు చేయనున్నారు.. గతంలో 3 వేల రూపాయలుగా ఉన్న ఇంటి నిర్మాణ ఫీజ్.. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఒక్క రూపాయికి తగ్గిపోయింది.. ఇక, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం ఇంటి నిర్మాణం డాక్యుమెంట్ ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేసి రూపాయి ఫీజ్ చెల్లించేలా ఏర్పా్ట్లు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య ప్రజలపై 6 కోట్ల రూపాయలకు పైగా భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.. కాగా, పేద, మధ్య తరగతి వర్గాలకు ఒక్క రూపాయికే ఇంటి నిర్మాణానికి అనుమతుల ఇవ్వాలనే కీలక నిర్ణయానికి ఇప్పటికే తీసుకుంది కూటమి సర్కార్‌.. తాజాగా, దీనిని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి.. ఆ వర్గాలకు శుభవార్త చెప్పింది..

Read Also: Speed Post: రేపటి నుంచే పోస్టల్ కొత్త రూల్స్ అమల్లోకి.. ఇకపై ఓటిపి ఆధారిత డెలివరీలు..

Exit mobile version