Bill Payments: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. గత ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.. గత ప్రభుత్వం అన్ని బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని.. రైతులకు చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించలేదని.. ఇలా అనే రకాలు విమర్శలు ఉన్నాయి.. అయితే, ఇప్పుడు ఏపీ ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు.. ఇప్పుడు బిల్లుల చెల్లింపులు చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.. 2014-19 నాటి బిల్లులు పెండింగులో ఉండగానే.. గత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
Read Also: Telugu Language Day 2024: తెలుగు భాషా దినోత్సవం.. తెలుగు వెలగాలి.. తెలుగు భాష వర్థిల్లాలి..
అంతే కాదు.. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది.. అయితే, తనకు తెలియకుండానే బిల్లుల చెల్లింపులు జరపడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారట.. మంత్రి పయ్యావుల కేశవ్.. జిల్లా పర్యటనలో ఉండగా.. గుట్టుగా బిల్లుల విడుదల చేసినట్లు గుర్తించారు. ఏ ప్రాతిపదికన ఆ బిల్లులు చెల్లింపు జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నారు పయ్యావుల కేశవ్.. యూసీల పేరుతో బిల్లులు చెల్లింపు జరిగిందమటున్న ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.. ఈ మొత్తం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనున్నారట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. కాగా, బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సచివాలయంలోని వివిధ శాఖల్లో వైసీపీ కోవర్టులు ఉన్నారని.. అలాంటి వారిపై ఓ కన్నువేయాలని.. బదిలీ చేయాలనే చర్చ సాగిన సందర్భంలో.. ఇప్పుడు ఆర్థిక శాఖలో మంత్రికి తెలియకుండానే బిల్లులు చెల్లింపు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.