Site icon NTV Telugu

Pawan Kalyan: శేషాచలం అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం..! వీడియో విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం.. జనసేన పార్టీ బిగ్ ఎక్స్‌పోజ్‌ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తాను స్వయంగా బహిర్గతం చేశారు.. మంగళంపేట అటవీ భూముల్లో అక్రమ ఆక్రమణలపై పవన్ కల్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్స్‌తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్‌ ఘాట్స్‌ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూకబ్జా బయటపడింది అన్నారు. ఈ భూములు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కల్యాణ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరగిందని అని తెలిపారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్వయంగా తాజా తిరుపతి పర్యటన లో సైట్‌ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు.

Read Also: YS Jagan: “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది..! చంద్రబాబుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు..

ఇక, ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్‌ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీమ్‌లతో విచారణ జరపాలని సూచించారు. అన్ని భూసమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి.. వాటిని కబ్జా చేసేవారిని విడిచిపెట్టం.. అని పవన్ కల్యాణ్‌ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ, వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసినవారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version