NTV Telugu Site icon

Paperless legislative system: ఇక, పేపర్ లెస్ శాసన వ్యవస్థ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఒప్పందం..

Paperless Legislative Syste

Paperless Legislative Syste

Paperless legislative system: ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో “కాగిత రహిత” (పేపర్ లెస్) శాసన వ్యవస్థ అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ మేరకు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడిషనల్ కార్యదర్శి సత్య ప్రకాశ్, ఏపీ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఒప్పందంపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.. ఏపీలోని రెండు చట్ట సభల్లో ఇక నుంచి శాసన వ్యవహారాలు, కార్యక్రమాలన్నీ కాగితం లేకుండా నిర్వహించేందుకు సాంకేతికంగా ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం “జాతీయ ఈ విధాన్ అప్లికేషన్” (“నేవా”-NeVA) కింద అన్ని రాష్ట్రాల చట్ట సభల్లో “పేపర్ లెస్” శాసన వ్యవస్థ అమలు చేయనున్నారు.. ఏపీలోని రెండు సభల్లో పేపర్ లెస్ శాసన వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి “ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రానికి వచ్చింది. అయితే, మొత్తం ఖర్చు అంచనాల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.. మరోవైపు.. ప్రాజెక్ట్ మొత్తం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. ఈ మేరకు పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది..

Read Also: I.N.D.I.A Alliance: మహారాష్ట్ర ఓటమితో అలిగిన టీఎంసీ.. ఆ బాధ్యత మమతా బెనర్జీకి ఇవ్వాలని డిమాండ్

Show comments