Deputy CM Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో తిరుగులేని విజయానికి అందుకునేవైపు సాగుతోంది బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. ఇప్పటి వరకు 220కి పైగా స్థానాల్లో బీజేపీ-ఏక్‌నాథ్‌షిండే-అజిత్‌పవార్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.. అయితే, మహావికాస్ అగాడి కూటమి మాత్రం చతికిలపడిపోయింది.. కేవలం 50కి పైగా స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్, శరద్‌పవార్-శివసేన కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.. మరోవైపు.. మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చక్రం తిప్పాడనే చెప్పాలి..
Read Also: Bandi Sanjay: మానేరు వాగుపై నూతన బ్రిడ్జి ని ప్రారంభించనున్న బండి సంజయ్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహించిన సంగతి విదితమే.. బహిరంగ సభల్లో.. రోడ్‌షోలలో పాల్గొన్నారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.. బల్లార్‌పూర్, పుణె, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు పవన్ కల్యాణ్.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. కాగా, పవన్ కల్యాణ్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం విదితమే.. పవన్ ఎక్కడికి వెళ్లినా.. OG.. OG.. అంటూ.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్.. అంతే కాదు.. మేము ట్రెండ్ ఫాలో కాము.. ట్రెండ్ సెట్ చేస్తాం అంటూ.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు..