Site icon NTV Telugu

Nara Lokesh: టీడీపీ మంత్రులతో లోకేష్‌ సమీక్ష.. కొత్త ఎమ్మెల్యేల వ్యవహారంపై కీలక సూచనలు..

Lokesh

Lokesh

Nara Lokesh: కొత్త ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు.. కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో.. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో, కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రధానంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మరియు వారి పనితీరు చుట్టూ సాగాయి. తొలిసారి గెలిచిన కొంతమందికి మంచిచెడులు తెలియట్లేదు.. అనుభవం లేకపోవడం వల్ల సమన్వయం లోపిస్తోంది అని లోకేష్ అభిప్రాయపడ్డారు. కొత్త ఎమ్మెల్యేలు సీనియర్‌ల అనుభవాన్ని నేర్చుకోవాలి.. సమస్యలను ఎలా అధిగమించాలో అవగాహన అవసరం అని సూచించారు.. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి.. లైన్‌లో పెట్టాల్సిన బాధ్యత మీదే అంటూ ఆదేశాలు జారీ చేశారట మంత్రి నారా లోకేష్‌..

Read Also: Maari Selvaraj: అంత ప్రేముంటే వాళ్ళ కులపోళ్లకే అవకాశాలివ్వచ్చుగా!

ఇక, విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారట లోకేష్.. సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించిన ఆయన.. ప్రత్యక్ష, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతి మంత్రి తమ శాఖ పరిధిలో ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాలి.. రేపు జరగబోయే MSME పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలి. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరవేర్చుదాం అని సూచించారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version